26 August, 2026 | 9:45 PM

హీరా గోల్డ్ ఆస్తులు వేలం వేసిన ఈడీ

26-06-2026 05:10 PM
  1. రూ. 159 కోట్ల విలువైన 23 ఆస్తులు వేలం
  2. నౌహీరా షేక్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్: ఈడీ అధికారులు(Enforcement Directorate) హీరా గోల్డ్ ఆస్తులను వేలం వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నౌహీరా షేక్(Nowhera Shaik), హీరా గ్రూప్ నకు చెందిన సీజ్ చేసిన రూ. 159 కోట్ల విలువైన 23 ఆస్తులను(Heera Gold Assets) వేలం వేశారు. ఏడాదికి 36 శాతానికి పైగా రాబడి ఇస్తామని పెట్టుబడిదారులకు హీరా గ్రూప్ హామీ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా రూ. 5,978 కోట్లకుపైగా నిధులను హీరా గ్రూప్(Heera Group) సేకరించింది. పెట్టుబడిదారులకు అసలు డబ్బు కూడా తిరిగి చెల్లించలేదని ఈడీ అధికారులు గుర్తించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంఎస్ టీసీ(MSTC) ద్వారా ఈ-వేలం నిర్వహించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును ఈడీ అధికారులు బాధితులకు పంపిణీ చేయనున్నారు. విచారణకు సహకరించకపోవడంతో సుప్రీంకోర్టు(Supreme Court) నౌహీరా షేక్ బెయిల్ ను రద్దు చేసింది. మే 21న గురుగ్రామ్ లో నౌహీరా షేక్ కు ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.