25 August, 2026 | 3:31 PM

Breaking News

అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •   పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి   •   వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి   •   మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •  

బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట

26-06-2026 05:21 PM

గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి...

సమిష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..

 సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా....

కొత్తగూడెం,(లక్ష్మీదేవిపల్లి),(విజయక్రాంతి): మన ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచారాలను ప్రతిఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం, అనిశెట్టిపల్లి గ్రామంలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించిన బొడ్రాయి, ముత్యాలమ్మతల్లి పునప్రతిష్ఠ మహోత్సవానికి, ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇటువంటి శుభకార్యాలు భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తాయని, భవిష్యత్ తరాలకు మన మూలాలను అందిస్తాయని, గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

గ్రామ ప్రజలంతా సమిష్టి కృషితో, కలిసికట్టుగా ఉంటూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇంతటి మహత్తరమైన పునప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్థులు ఐక్యతతో విజయవంతం చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. అనంతరం ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన  అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అన్నదానం వంటి సత్కార్యాలు సమాజంలో సేవాభావాన్ని, మానవత్వాన్ని చాటుతూ ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా  పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకట నర్సయ్య, రమణయ్య, వీరబాబు, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, సతీష్, శ్రీనివాసరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.