వర్షాలు కురవాలని మడేలేశ్వర స్వామికి జలాభిషేకం
26-06-2026 05:18 PM
చేర్యాల: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని కోరుతూ చేర్యాల పట్టణ కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి దేవాలయంలో కురుమ కులస్తులు జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆరిద్ర కార్తి ప్రారంభమైన వర్షాలు సరిగ్గా పడక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరుణుడి కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు,కుంటలు నుండి భూగర్భ జలాలు వృద్ధి చెందాలని,పాడిపంటలతో కళకళలాడాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ మడేలయ స్వామికి జలాలతో అభిషేకం నిర్వహించారు.






