14 April, 2026 | 1:40 PM

ఆయుశ్ మాత్రేకే జట్టు పగ్గాలు

28-12-2025 12:00 AM

అండర్ 19 వరల్డ్‌కప్‌కు జట్టు ప్రకటన

సౌతాఫ్రికాతో సిరీస్‌కు సారథిగా వైభవ్ సూర్యవంశీ

జనవరి 15 నుంచి మెగాటోర్నీ

ముంబై, డిసెంబర్ 27 : వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో ఓడినప్పటకీ ఆ యుశ్ మాత్రేనే సారథిగా కొనసాగించాలని నిర్ణయించారు. అటు జట్టులో కూడా పెద్దగా మార్పులేమీ చేయలేదు. వైస్ కెప్టెన్‌గా విహా న్ మల్హోత్రాను నియమించారు. యువ సం చలనం వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్ కంటే ముం దు భారత జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.

ప్రస్తుతం గాయాలతో బాధపడుతున్న ఆయుశ్ మాత్రే, విహాన్ మల్హోత్రాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. దీంతో సౌతాఫ్రికా జట్టు తో జరిగే సిరీస్‌కు వైభవ్ సూర్యవంశీ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే అండర్ 19 ప్రపంచకప్ జనవరి 15 నుంచి మొదలుకానుండగా జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీలో 16 జట్లు పోటీపడుతుండగా.. భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, యుఎస్‌ఏతో కలిసి గ్రూప్ ఏలో ఉంది. తన ఆరంభ మ్యాచ్‌లో జనవరి 15న భారత్ , యూఎస్‌ఏతో తలపడుతుంది. 

ఐసీసీ అండర్ 19 

ప్రపంచకప్‌కు భారత జట్టు

ఆయుశ్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ , ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ సింగ్, అంబరీష్, కాన్షిక్ చౌహాన్, ఖిహాన్ పటేల్, మహ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్

సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత్ అండర్ 19 జట్టు

వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్),ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ సింగ్, అంబరీష్, కాన్షిక్ చౌహాన్, ఖిహాన్ పటేల్, మహ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్