4 June, 2026 | 1:37 AM

ప్రీక్వార్టర్స్‌లో ఆయుశ్ షెట్టి, రోహన్ జోడీ

04-06-2026 12:00 AM

ఇండోనేషియా ఓపెన్

జకార్తా, జూన్ 3: భారత యువ సంచల నం ఆయుశ్ షెట్టి, మిక్స్‌డ్ డబుల్స్ జోడీ రోహన్ కపూర్, రుత్విక శివానీ జోడీ ఇండోనేషియా ఓపెన్ ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుశ్ షెట్టి 8 స్కోరుతో చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆయుశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. తొలి గేమ్‌ను 8 కోల్పోయిన ఆయుశ్ రెండో గేమ్‌లో గెలిచి స్కోర్ సమం చేశాడు.

మూడో గేమ్‌లోనూ అదే దూకుడు కొనసాగిస్తూ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్న హాంగ్‌ను ఓడించాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ రోహ న్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన యాంగ్ ఫాంగ్‌పై వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న ప్రత్యర్థి జోడీని 21 21 స్కోర్‌తో చిత్తు చేసింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తర్వాతి రౌండ్‌లో భారత జోడీ డిఫెండింగ్ ఛాంపియన్స్ గిక్కోల్ డ్లుఫైన్ జోడీని ఢీకొంటుంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ షెట్టి గురువారం మ్యాచ్‌లు ఆడనున్నారు.