3 June, 2026 | 1:40 AM

టీమిండియా బిజీబిజీ

03-06-2026 01:01 AM

10 టెస్టులు, 20 వన్డేలు, 23 టీ20లు

ఏడాదిన్నర పాటు నాన్‌స్టాప్ క్రికెట్

పలు కీలక విదేశీ సిరీస్‌లు

మిషన్ 2027 టార్గెట్‌గా టూర్‌లు

ముంబై, జూన్ 2: ఐపీఎల్ హంగామా ముగిసింది. ఇక టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ హడావుడి మొదలుకాబోతోంది. ఎ ప్పటిలానే రెస్ట్ లేకుండా నిర్విరామంగా 18 నెలల పాటు బిజీబిజీగా గడపబోతోంది. 2027 ఐపీఎల్ సీజన్ ముందు వరకూ పలు కీలక సిరీస్‌లు ఆడనుంది. ఈ మధ్యకాలంలో భారత జట్టు 10 టెస్టులు, 20 వన్డే లు, 23 టీట్వంటీలు అంటే మొత్తం 53 మ్యా చ్‌లు ఆడనుంది. వీటిలో పలు చిన్న జట్లతో సిరీస్‌లు, పెద్ద జట్లతో టెస్ట్ సిరీస్‌లు కూడా ఉన్నాయి.

మధ్యలో ఆసియా క్రీడలు, వెస్టిండీస్ సిరీస్ కూడా ఒకే సమయంలో రావడంతో బీసీసీఐ రెండు జట్లను సిద్ధం చేసి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ బిజీ షెడ్యూల్‌కు సంబంధించి మిషన్ 2027 వన్డే ప్రపంచకప్, డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్ టార్గెట్‌గా గౌతమ్ గంభీర్ టీమ్‌ను సెట్ చేయబోతున్నాడు. ఈ క్రమంలో పలు కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వన్డే ప్రపంచకప్‌కు ఏడా ది సమయం మాత్రమే ఉండగా.. తర్వాత డబ్ల్యూటీసీ సవాల్ ఎదురుచూస్తోంది.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటన నుంచే గంభీర్ తన ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మరో మూడు రోజుల్లో భారత్ ఆప్ఘనిస్థాన్ సిరీస్‌తో తన అంతర్జాతీయ షెడ్యూల్‌ను మొద లుపెడుతుంది. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో ఒక టెస్ట్, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది. జూన్ 6 నుంచి జూన్ 20 వర కు జరిగే ఈ సిరీస్‌తో టీమిండియా కొత్త సీ జన్ను ప్రారంభించనుంది.

ఈ సిరీస్ తర్వాత భారత జట్టు వరుసగా ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో తలపడనుంది. దీంతో ఈ షెడ్యూల్ జట్టు బలం, బెంచ్ స్ట్రెంగ్త్, యువ ఆటగాళ్ల ప్రతిభకు పరీక్షగా నిలవనుంది. జూలై నెలలో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టీ20లు, మూడు వన్డేలతో కూడిన ఈ సిరీస్ జూలై 1 నుంచి 19 వరకు జరుగుతుంది. విదేశీ గడ్డపై ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ సవాల్‌గానే ఉం టుంది. యువ, సీనియర్ క్రికెటర్లతో కూడిన టీమిండియాను గిల్ అక్కడ ఎలా నడిపిస్తాడో చూడాలి.

ఆ తర్వాత ఆగస్టులో శ్రీలం క పర్యటనకు వెళ్లనున్న భారత్ రెండు టెస్టులు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంజి. అలాగే సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సి రీలు ప్రపంచకప్  ప్రణాళికలకు కీలకంగా మారనున్నాయి. అదే నెలలో ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై మరోసారి మూడు టీ20 మ్యాచ్‌ల సి రీస్ కూడా టీమిండియాకు ఎదురుచూస్తోం ది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరిగే ఏషియ న్ గేమ్స్‌లో క్రికెట్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు.

ఈ టోర్నీలో భారత్ మరోసారి స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగ నుంది. యువ ఆటగాళ్లకు ఈ మెగా ఈవెం ట్ మంచి వేదికగా నిలవనుంది. అనంతరం అక్టోబర్‌లో వెస్టిండీస్ భారత్‌కు రానుండగా, ఆ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన కూడా అత్యంత కీలకంగా మారనుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 లు ఆడనుంది. న్యూజిలాండ్ పరిస్థితుల్లో విజయం సాధించడం ఎప్పుడూ కష్టమే. అం దువల్ల ఈ పర్యటనపై సెలెక్టర్లు, కోచ్‌ల దృ ష్టి ప్రత్యేకంగా ఉండనుంది.

2027 ఆరంభంలో భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్‌లలో ముఖ్యమైనది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ జనవరి- ఫిబ్ర వరి నెలల్లో జరగనుంది. ఈ సిరీస్ వరల్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో భా రత్‌కు అత్యంత కీలకంగా మారింది. ము ఖ్యంగా 2027 ఆరంభం నుంచే భారత్ క్రికెట్‌కు కీలక సిరీస్‌లు పరీక్ష పెట్టనున్నాయి.

జూన్‌లో జరిగే డబ్య్లూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడమే తొలి లక్ష్యంగా చెప్పొచ్చు. అ నంతరం జూలైలో బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. అందరి చూపు అక్టోబర్‌లో జరగనున్న 2027 వన్డే వరల్డ్ కప్ పైనే ఉన్నాయి. ద్రక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యం లో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప టి నుంచే టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

జూన్ 2026

ఆప్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్, ౩ వన్డేలు

ఐర్లాండ్ టూర్‌లో 2 టీ20లు

జూలై 2026

ఇంగ్లాండ్ టూర్‌లో 5 టీ20లు, 3 వన్డేలు

జింబాబ్వే టూర్‌లో 3 టీ20లు

ఆగష్టు 2026

శ్రీలంక టూర్‌లో 2 టెస్టులు, 3 టీ20లు

సెప్టెంబర్ 2026

ఏషియన్ గేమ్స్

అక్టోబర్ 2026

విండీస్ భారత్ టూర్‌లో 3 వన్డేలు, 

5 టీ20లు

డిసెంబర్ 2026

శ్రీలంక భారత్ టూర్‌లో 3 వన్డేలు, 

3 టీ20లు

జనవరి 2027

జింబాబ్వే భారత్ టూర్‌లో 3 వన్డేలు

ఆస్ట్రేలియా భారత్ టూర్‌లో 5 టెస్టులు