ఇంగ్లాండ్ మహిళలదే టీ20 సిరీస్
చివరి మ్యాచ్‌లో భారత్ ఓటమి
టౌంటన్, జూన్ 3: టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ గెలవాలనుకున్న భారత్ మహిళల జట్టు ఆశలు నెరవే రలేదు. టౌంటన్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (56) టాప్ స్కోర సాధిస్తే నిలవగా.. యాస్తికా భాటి యా(32), దీప్తి శర్మ(32) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్మిత్, డీన్ ఒక్కో వికెట్ సాధించారు. భారీ స్కోర్ ఛేజింగ్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది.
సోఫీయా డంక్లీ 13 బంతుల్లో 16, డ్యానీ 5 బంతుల్లో 5, ఏమీ జోన్స్ 6 బంతుల్లో 3 పరుగులు చేసి అవుటవ్వడంతో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఆలిస్ క్యాప్సే (82), హీథర్ నైట్ (70) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ తలా రెండు వికెట్లు తీశారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన క్యాప్సీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.






