3 July, 2026 | 6:03 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తనిఖీ

28-06-2025 12:00 AM

మహబూబాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి (ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరం) ఎస్టీ బాలుర హాస్టల్ ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి.రవి రాథోడ్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు, రికార్డు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యసేవలను, అడిగి తెలుసుకున్నారు.

రోగనిర్ధారణ, వైద్యం, మాతా శిశు సంరక్షణ సేవలు పై అడిగి తెలుసుకున్నారు.  హాస్టల్  సందర్శించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వంటశాల, తాగునీటి వసతి సరిగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సాగర్, హెల్త్ ఎడ్యుకేటర్ కె.వి రాజు, ఎంఎల్ హెచ్ పి హెచ్ పి చందన , ఆరోగ్య కార్యకర్త కళావతి, ఆశా కార్యకర్తలు, ఎస్టి హాస్టల్ వార్డెన్ సతీష్, యాకుబ్, పాల్గొన్నారు.