మర్కోడులో ఘనంగా అయ్యప్ప దీక్షాధారుల ఇరుముడి
ఆళ్ళపల్లి, డిసెంబర్ 5, (విజయక్రాంతి): మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో అయ్యప్ప దీక్షాదారుల ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గురుస్వా ములు పొదిల రాము రడం శేఖర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మాధవన్ నంబూద్రి గురుస్వామి చే మహా పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ పడిపూజ కార్యక్రమం లో పాల్వంచ శ్రీనివాస్ భజన బృందం ఆలపించిన అయ్యప్ప సంకీర్తనలతో మర్కోడు గ్రామం మారు మో గింది శుక్రవారం ఉదయం ఇరుముడలతో స్వాములు గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా శబరిమలైకి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి నవీన్, తాళ్లపల్లి రవికు మార్ తాళ్లపల్లి శేఖర్ ఆరేళ్ల లక్ష్మీనారాయణ కుర్ర కిరణ్ వగలబోయిన మహేష్ రామడుగు సాయి కరణ్ గంధసిరి రణదీప్ బానోత్ నాగేశ్వరరావు వగలబోయిన రాం బాబు రామడుగు నరసింహాచారి బూర్న వినయ్ కుమార్ కొమరం వెంకటేష్ పా యం సంతోష్ కొమరం బాబురావు కొమరం నవీన్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






