calender_icon.png 24 November, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా అయ్యప్ప పడిపూజ

24-11-2025 12:00:00 AM

-హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

మణికొండ,  నవంబర్ 23 (విజయక్రాంతి) : మణికొండ శివాలయంలో ఆది వారం అయ్యప్ప మహా పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తోలుకంటి ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప మాలధారులు, గురుస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శరణు ఘోషతో మార్మోగింది.

ఈ పూజా కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీరాములు, గురుస్వామి రాజేంద్ర గౌడ్, నార్సింగి ఏఎంసీ డైరెక్టర్ ఏర్పుల కుమార్, నాయకులు శ్రవణ్ కుమార్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.