24-11-2025 12:00:00 AM
-రోడ్లపైనే మురుగు నీరు పరుగు
-స్పందించని వార్డు శానిటేషన్ ఇంచార్జీ
బండ్లగూడ జాగిర్, నవంబర్ 23 (విజయక్రాంతి) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14 వ వార్డు స్నేహిత హిల్స్‌లో పారిశుద్ధ్యం లోపించింది . వాలి ఓక్ జూనియర్ కాలేజీ సమీపంలో రోడ్డుపై డ్రైనేజ్ నీరు ప్రవహిస్తున్ డంతో పారిశుధ్యం ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పవచ్చు.. మున్సిపల్ అధికారులు గతంలో స్నేహిత హిల్స్ ఫేస్ 1 కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని నిర్మించారు.
గత నెల రోజుల నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో పూర్తిగా వ్యర్ధాలు నిండిపోయి డ్రైనేజీ లోని మురుగు నీరు రోడ్డుపైకి చేరి పెద్ద మొత్తంలో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తున్ డం వల్ల స్నేహిత హిల్స్ లోని కాలనీవాసులకు మురుగునీటి దుర్వాసన తప్పడం లేదు.. శానిటేషన్ వ్యవహారాలు చూసే 14 వార్డు సిబ్బందికి సమస్యలు వివరించేందుకు ఫోన్ చేసిన వారు ఫోన్ లో అందుబాటులోకి రావడం లేదు ప్రధాన రోడ్డు వెంట మురుగునీరు ప్రవహిస్తుండడంతో రోడ్డు అంత బురదమయం అయింది . మున్సిపల్ కమిషనర్ స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి మరమ్మతు చేయించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.