28 April, 2026 | 2:19 AM

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణం

28-04-2026 12:23 AM

హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారంచేశారు. శాసన మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం అజారుద్దీన్, కోదండరాం చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు హాజర య్యారు.

కాగా గత కొంత కాలంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ తీవ్ర ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. ఈ కోటాలో రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం నియామకానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించినా ఈ ఫైల్ గవ ర్నర్ వద్ద ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్నది. దీంతో అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండానే మంత్రివర్గం లో చోటు దక్కించుకున్న అజారుద్దీన్ మంత్రి పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ నెలాఖరుతో ఆయన ఓదో ఒక సభకు ప్రాతినిథ్యం వహించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా కోదండ రాం, అజారుద్దీన్ పేర్లను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నామినేట్ చేశారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేయడంతో ఎమ్మెల్సీలుగా ప్రమా ణం చేశారు. 

రాజకీయాల్లోనూ సిక్సర్లు కొడతా : అజారుద్దీన్ 

ప్రస్తుతానికి తనకు పొలిటికల్ ఫ్యాన్స్ కంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువే ఉండొచ్చని కానీ, ఇకపై ప్ర జల కోసం కష్టపడి పనిచేసి రాజకీయ అభిమానులను కూడా సంపాదించుకుంటాను అజారుద్దీన్ ధీమా వ్యక్తంచేశారు. తనకు ఎమ్మెల్సీగా, మంత్రి గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి, సహచర మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఒక ఆటగాడిగా దేశానికి ఎలాగైతే సేవ చేశానో, అలాగే ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం కో సం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రా ధాన్యం ఇస్తోందని తెలిపారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, అన్నింటిని అధిగమించి ముందుకు సాగలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం మం త్రి పదవి ఇచ్చారనేది వాస్తవం కాదని, సీఎం రేవంత్‌రెడ్డి మైనార్టీలకు మొదటి నుంచి పెద్దపీట వేస్తున్నరాని వెల్లడించారు.