గర్భిణులకు సామూహిక సీమంతాలు
28-04-2026 12:23 AM
కోహెడ, ఏప్రిల్ 27: తీగలకుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి గర్భిణి స్త్రీలను సంప్రదాయ పద్దతిలో ఘనంగా సత్కరించారు. సూపర్ వైజర్ సాయిభవాని, గ్రామ పంచాయతీ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.






