ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
రామచంద్రపురం, ఏప్రిల్ 27 : బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని రామచంద్రపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. భారతీనగర్ డివిజన్లోని బస్ స్టాప్, రామచంద్రాపురం బాలవిహార్ పార్క్ సమీపంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో చారిత్రాత్మక పాత్ర పోషించిన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు.
రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య ,ఆలూరి గోవింద్ ,పరమేష్ యాదవ్, నవీన్ బూన్, తొంట కృష్ణకాంత్, ఐలేష్, క్రాంతి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.






