17 April, 2026 | 11:47 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2025 10:10 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. KTPS అంబేద్కర్ సెంటర్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం, డిష్ నాయుడు, మల్లెల రవిచంద్ర, దాసరి నాగేశ్వరరావు, కాల్వ ప్రకాష్, భూక్య చందు నాయక్, సమ్మయ్య గౌడ్, పట్టణ BRS మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల, BRSV పట్టణ అధ్యక్షులు దుర్గాప్రసాద్, బేతంశెట్టి విజయ్, తదితరులు పాల్గొన్నారు.