30 May, 2026 | 1:33 PM

Breaking News

దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •   డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ   •   తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ   •   అన్నకు చెల్లెలి నగ్న ఫోటో పంపి డబ్బులు డిమాండ్.. యువకుడు అరెస్ట్   •  

సత్తుపల్లి డిపోలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2026 02:10 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) సత్తుపల్లి డిపోలో డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భారతదేశానికి ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు.

సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని అన్నారు. భారతదేశానికి తొలి ఉప ప్రధానిగా ఆయన  చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి, వెల్ఫేర్ కమిటీ సభ్యులు సైదిరెడ్డి, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు జగన్నాథం, వెంకటయ్య, బసవయ్య, బాలస్వామి, టీ ఐ త్రీ జాకబ్, ఏడీసీలు కిరణ్ బాబు, కాంతారావు, సత్యం వీరితోపాటు గ్యారేజీ సిబ్బంది అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.