వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు
బోథ్,మే 30(విజయక్రాంతి): వడ్రంగి పని వారిని అటవీశాఖ అధికారులు. అడ్డంకులకు గురి చేస్తున్నారని చేరుకుంటూ స్థానిక ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) విన్నవించారు.తాము టింబర్ డిపో నుండి కొనుగోలు చేసిన కర్రతో పని చేయడానికి అనుమతులు లేవని అంటున్నారని శనివారం స్థానిక ఎమ్మెల్యే కు వినతిపత్రం అందించారు.
మండల కేంద్రంలోని వడ్రంగులంతా కర్ర పని చేసి, జీవిస్తున్నామని తాము టింబర్ డిపో నుండి కొనుగోలు చేసిన కర్రతో మాత్రమే పనిచేస్తున్నామని అయితే స్థానికంగా వర్క్ షాప్ అనుమతులు లేవని అడ్డుకుంటున్నారని వారు వాపోయారు. ఇతర జిల్లాల నుండి తమకు వివిధ రకాల ఫర్నిచర్ కు సంబంధించి ఆర్డర్లు వస్తాయని అయితే అటవీశాఖ వారి నిబంధనల వల్ల తాము జీవించలేకపోతున్నామని వాపోయారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు విన్నవించారు. కాగా మండల కేంద్రంలో శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యేను వారు కోరారు






