30 May, 2026 | 2:12 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబు కార్యదీక్షతతో దూసుకుపోతున్న ఐటీ రంగం   •   మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత   •   BRS మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ “అరెస్ట్”   •   దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •  

ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పోలీసుల నిఘా

05-04-2026 02:13 PM

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్యే నిర్బంధం

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పోలీసుల నిఘాలోనే పర్యటన కొనసాగిస్తున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఖానాపూర్‌కు వెళ్లకుండా పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి కోవలక్ష్మి హాజరయ్యారు.

ఆమె పర్యటనకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఒక పోలీస్ వాహనం కూడా వెంట వెళ్లింది. కలెక్టరేట్ వద్ద కూడా భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే కోవలక్ష్మి తప్పుబట్టారు. తాను ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని అయినప్పటికీ స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నిర్బంధించడం సరైంది కాదని అన్నారు. తమపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా పోలీసుల ద్వారా నిర్బంధించడం అన్యాయమని మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారని, సరైన సమయంలో వారే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే కోవలక్ష్మి పేర్కొన్నారు.