30 May, 2026 | 1:44 PM

Breaking News

దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •   డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ   •   తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ   •   అన్నకు చెల్లెలి నగ్న ఫోటో పంపి డబ్బులు డిమాండ్.. యువకుడు అరెస్ట్   •  

ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం

30-05-2026 12:28 PM

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)లో శనివారం నాడు బెంగళూరు-నాగ్‌పూర్ ఇండిగో విమానం(Bengaluru-Nagpur Indigo flight) అత్యవసర ల్యాండింగ్ అయింది. ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ RGIA అధికారులకు సమాచారం అందించగా వారు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు. ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.