30 May, 2026 | 2:12 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబు కార్యదీక్షతతో దూసుకుపోతున్న ఐటీ రంగం   •   మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత   •   BRS మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ “అరెస్ట్”   •   దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •  

బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళి

05-04-2026 02:07 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి దివంగత బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామంలోని స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.