తుంగతుర్తిలో ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, వివిధ సంఘాల నాయకులు ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో అత్యధిక సార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రావుని ఆయన చిన్నతనం నుండే కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేశారని దళితుల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన మహానీయుడు అని కొనియాడారు.
ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక స మల్లెపాక సాయి బాబా, సభావత్ బికోజి నాయక్, భాస్కర్ నాయక్, కత్తుల నరేష్, రవీందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండె గాని రాములు గౌడ్ తడకమళ్ళ రవికుమార్ , గోపగాని రమేష్, బొజ్జ సాయికిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు, కొండరాజు, మాచర్ల అనిల్ దాసరి శ్రీను, పోలేపాక రామచంద్ర, హెంల నాయక్, తదితరులు పాల్గొన్నారు.




