30 May, 2026 | 6:51 PM

లూమినా డాటామాటిక్స్‌లో జ్యోతిష్మతి విద్యార్థుల సత్తా – 12 మంది ఎంపిక

30-05-2026 06:20 PM

కరీంనగర్,(విజయక్రాంతి): జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో లూమినా డాటామాటిక్స్‌  సంస్థ ఆధ్వర్యంలో ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడింది. ఈ నియామక ప్రక్రియలో గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ వంటి పలు దశలను నిర్వహించి విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమస్య పరిష్కార సామర్థ్యం మరియు వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు.

ఈ డ్రైవ్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, కఠినమైన ఎంపిక ప్రక్రియ అనంతరం 12 మంది విద్యార్థులు లూమినా డాటామాటిక్స్‌లో రూ. 3  లక్షల ప్యాకేజీ తో ఉద్యోగ అవకాశాలకు ఎంపికయ్యారు. సంస్థ చైర్మన్ జె. సాగర్ రావు, సెక్రటరీ & కరస్పాండెంట్  జె. సుమిత్  విభాగాధిపతులు, ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్లు మరియు అధ్యాపకులు ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.