రైలు పట్టాలపై పసి పాప
15-04-2026 12:32 AM
నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఖైరతాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): నగరంలోని ఖైరతాబాద్- లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై 15 రోజుల పసికందును వదిలివేసిన ఘటన చోటు చేసు కుంది. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో పాపను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే స్పందించి శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పాపను పట్టాలపై వదిలివేసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.






