ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి నియామకం
15-04-2026 12:33 AM
ఎర్రుపాలెం ఏప్రిల్ 14 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి కి మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు శుభాకాంక్షలు తెలియజేశారు.
శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ,వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ కమిటీల అధ్యక్షులు ఆత్మ కమిటీ డైరెక్టర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు , మండలంలోని వివిధ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వేమిరెడ్డి సుధాకర్ రెడ్డిని వివిధ గ్రామాల సర్పంచులు ఘనంగా సన్మానం చేశారు.






