17 April, 2026 | 3:07 PM

బేబీ.. ట్రిమ్మర్!

18-05-2025 12:00 AM

అప్పుడే పుట్టిన పసిపాపలకి.. బోసినవ్వులు రాకముందే గోళ్లు వచ్చేస్తాయి. తల్లుల్ని సూదుల్లా గుచ్చుతాయి. ఆ గోళ్లని అతిసులువుగా తీయడానికి వచ్చిందే ఈ ‘బేబీ నెయిల్ ట్రిమ్మర్’. ఈ పరికరంలో మెత్తనైన శాండ్‌పేపర్‌తో చేసిన ఆరురకాల ‘గ్రైండింగ్ హెడ్స్’ ఉంటాయి.

శిశువుల నెలల్నిబట్టి ఈ గ్రైండింగ్ హెడ్స్‌లో ఒకదాన్ని.. మెషిన్‌పైన ఉన్న ‘షాఫ్ట్’కి తగిలించి ఆన్‌చేస్తే అది గిర్రున తిరుగుతుంది. అలా తిరుగుతున్నదాన్ని గోటిపైన ఉంచితే చాలు.. గోరు అరిగిపోతుంది. పొరపాటున చర్మానికి తగిలితే టక్కున ఆగిపోయేలా ఈ మెషిన్‌ని రూపొందించారు. కాబట్టి.. చర్మానికి ఏ గాయం కాదు.