17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఐస్ క్రీం తింటున్నారా?

18-05-2025 12:00 AM

ఏజ్‌తో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ఐస్ క్రీం తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ మనం ఎంతగానో ఇష్టపడే ఐస్ క్రీం మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా? ఐస్ క్రీం తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఐస్ క్రీం తయారీకి ఉపయోగించే.. పదార్థాల కల్తీ కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు. 

* ఐస్ క్రీంలో అధిక చక్కెర, క్రీమ్ ఉంటాయి. ఐస్ క్రీం ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి ఇది మరిన్ని ఇబ్బందులను కలిగిస్తుంది.

* ఐస్ క్రీంలో ఎక్కువ శాతం చక్కెర ఉంటుంది. ఇది దంతాలకు హాని కలిగిస్తుంది. దీనివల్ల దంతక్షయం, నొప్పి వస్తుంది. ఐస్ క్రీం తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోకపోతే.. దంతాలు మరింత త్వరగా పాడవుతాయి. 

* చాలామందికి పాల ఉత్పత్తులను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఐస్ క్రీం కూడా పాలతో తయారవుతుంది. కాబట్టి కొంతమందికి దీన్ని తిన్న తర్వాత గ్యాస్, తలనొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

* ఐస్ క్రీంలో అధిక కొవ్వు, చక్కెర ఉంటాయి. ఇవి మన శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయి. ఈ ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. మొటిమలు, చర్మ సంబంధిత ఎలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 

* ఐస్ క్రీంలో అధిక చక్కెర కారణంగా డయాబెటిస్ ఉన్నవారికి లేదా డయాబెటిస్ ప్రమాదం ఉన్నవారికి ఐస్ క్రీం అస్సలు మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర ఆకస్మాత్తుగా పెరగడానికి కారణమవుతుంది.