పొటాషియం లోపిస్తే!
18-05-2025 12:00 AM
ఖనిజ లవణాల్లో ఒకటైన పొటాషియం మనకు ఎంతగానో తోడ్ప డుతుంది. నాడులను, కండరాలను నియంత్రించటం దగ్గర నుంచి.. ఆహారం జీర్ణం కావటం వరకు ఎన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. అందుకే పొటాషియం లోపిస్తే కండరాలు పట్టేయటం, గుండె కొట్టుకునే వేగం మారిపోవటం, చర్మం పొడిబారటం, మొటిమలు, అజీర్ణం వంటి సమస్యలెన్నో ముంచుకొస్తాయి. పొట్టుతీయని ధాన్యాలు, మాంసం, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయల్లో పొటాషియం దండిగా ఉంటుంది. ముఖ్యం గా అరటిపండు, చిలగడదుంపలతో పుష్కలంగా లభిస్తుంది.






