స్పీకర్ చాంబర్‌లో కొనసాగుతున్న బీఏసీ సమావేశం
12-03-2025 01:02 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం(BAC Meeting) ప్రారంభం అయింది. బడ్జెట్ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలో బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. బీఏసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.






