calender_icon.png 14 May, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాడ్‌బాయ్ కార్తీక్ ముగించాడు

14-05-2025 12:23:03 AM

హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ మూవీకి రామ్ దేశిన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటిం గ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తా రు. ఈ చిత్రంలో నాగశౌర్య జోడీగా విధి హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేశ్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: రసూల్ ఎల్లోర్; సంగీతం: హారిస్ జయరాజ్; ఆర్ట్: రామాంజనేయులు; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు.