14-05-2025 12:24:39 AM
‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘మట్కా’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కరుణకుమార్. ఆయన తాజాగా రూపొందిస్తున్న సినిమాలో తన సహజ శైలితోపాటు కొత్త ప్రయోగాలను చేయనున్నారు. ఇందులో నవీన్‌చంద్ర సవాల్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నారు. శేఖర్ స్టూడియో బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘హానీ’. ఈ మూవీ మంగళవారం లాంఛనంగా ప్రారంభమైంది.
షూటింగ్ ప్రారంభ కార్యక్రమంలోనే మూవీ కాన్సెఫ్ట్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. పోస్టర్‌లో కనిపించే పిల్లి, పాప ఈ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేశాయి. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో దివ్యా పిళ్లు, దివి, రాజారవీంద్ర, కళ్యాణి మాలిక్, బేబీ జయని ముఖ్య పాత్రలు పోషిస్తారు. చిత్రీకరణ ప్రారంభం సందర్భంగా హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. ‘నా కెరియర్‌లో విభిన్నమైన పాత్రలు చాలా ఉన్నాయి.
కానీ ఈ మూవీలో పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడు కాస్త భయపడ్డా. ఇలాంటి పాత్ర గురించి నేనెప్పుడూ వినలేదు. ఇలాంటి పాత్రలు ఏ నటుడికైనా అరుదుగా వస్తాయి. ఈ పాత్ర నాకు కొత్త సవాల్‌తో కూడుకున్నది’ అన్నారు. “హనీ’ కథకు సమాజంలో చాలా రిఫరెన్సులు ఉన్నాయి. మనిషిలోని ఆశ తీసుకెళ్లే చీకటి ప్రపంచాన్ని చాలా బోల్డ్‌గా తెరమీదకు తీసుకురాబోతున్నా.
నవీన్‌చంద్ర నటన, కథ లోతు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపే అంశాలు’ అని దర్శకుడు కరుణకుమార్ తెలిపారు. శేఖర్ మాస్టర్, రవి పీట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నగేశ్ బనేళ్ల; సంగీతం: అజయ్ అరసాడ.