14-05-2025 12:20:01 AM
సిద్ధార్థ్ హీరోగా శ్రీగణేశ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఈ ద్విభాషా చిత్రాన్ని అరుణ్ విశ్వ తెలుగు- తమిళ్‌లో నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ టీజర్ విడుదలైంది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
జూలై 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి డీవోపీ: దినేశ్ కృష్ణన్ బీ, జితిన్ స్టానిస్లాస్; సంగీతం: అమృత్ రామ్‌నాథ్; మాటలు: రాకేందు మౌళి; ఎడిటర్: గణేశ్ శివ; ఆర్ట్: వినోద్ రాజ్‌కుమార్ ఎన్.