09-12-2025 12:46:28 AM
దేవాదాయ శాఖ ప్రత్యేక బృందం పరిశీలన
వేములవాడ, డిసెంబర్ 08 (విజయ క్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయం రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన మార్కింగ్ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పనుల పరిశీలన కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ, హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుండి ప్రత్యేక సాంకేతిక బృందం వేములవాడకు చేరుకుంది.
ఈ కార్యక్రమంలో స్థపతి వల్లి నాయగం, ఈఈ ఎస్.ఈ దుర్గా ప్రసాద్, ఆలయ ఈఓ ఎల్. రమాదేవి పాల్గొన్నారు. వీరితో పాటు ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, అలాగే ఆలయ సిబ్బంది కూడా ఉన్నారు.శ్రీ బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన మార్కింగ్, నిర్మాణ విధానం, విస్తీర్ణం, శిల్పకళా ప్రమాణాలు వంటి అంశాలను అధికారులు సవివరంగా సమీక్షించారు. శిల్పకళా సంప్రదాయాలకు అనుగుణంగా, భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తూ రాజగోపురం నిర్మించేందుకు అవసరమైన మార్గదర్శకాలు నిర్ణయించినట్లు తెలిసింది.