09-12-2025 12:47:34 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
కరీంనగర్, డిసెంబరు 8 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణం 39వ డివిజన్ పోచమ్మవాడ లోని శ్రీరామకాలనీ ప్రజల మంచినీటి కష్టాలకు విముక్తి లభించింది. దాదాపు 5సంవత్సరాల నుండి మంచినీటి సౌకర్యం లేకుండా కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి అమృత్ స్కీం కింద శ్రీరామకాలనీ ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారులు అమృత్ స్కిం కింద మంచినీటి పైప్ లైన్ వేసి మంచినీరు సౌకర్యాన్ని కల్పించారు.
ఈ మేరకు బిజెపి నాయకుడు మాసం గణేష్ స్థానిక కాలనీ ప్రజలతో కలిసి సోమవారం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్ , బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, నల్ల కనెక్షన్ ను ప్రారంభించారు . ఏళ్ల తరబడి గా కాలనీ ప్రజలు ఎదురుచూసిన మంచినీటి సమస్య పరిష్కారం కోసం కృషిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మున్సిపల్ కమిషనర్, అధికారులకు కృతజ్ఞతలుతెలిపారు.