calender_icon.png 7 June, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్వెల్లిలో బడిబాట

06-06-2025 11:39:09 PM

మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లిలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను, నాణ్యమైన బోధన గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాఠశాలను దత్తత తీసుకున్న నారెడ్డి నందా రెడ్డి మాట్లాడుతూ... తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, పాఠశాలలో అన్ని సౌకర్యాలు  ఉన్నాయన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యురాలు శైలజ, జకాట ప్రేమ దాస్, ఈశ్వర్, ఉపాధ్యాయులు గడప నవీన్, వసీం, శ్రీనివాస్, రీతు, రంగారావు, ప్రభాకర్, స్వరూపారాణి, సోనీ, మంజుల, హరీష్, అనిత తదితరులు పాల్గొన్నారు.