15 April, 2026 | 1:50 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

పైసల బడికి మీ పిల్లల్ని పంపకండి

22-04-2025 01:36 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మీ పిల్లలను పైసల బడికి పంపకండి.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా విద్య నేర్పి ఏడాదికి రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఉచితంగా వైద్య పరీక్షలు, వారానికి మూడు కోడిగుడ్లతో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించే ప్రభుత్వ బడికి మీ పిల్లలను పంపి భవిష్యత్తు తీర్చిదిద్దాలని తల్లిదండ్రులను కోరుతూ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు గ్రామాల్లో ‘బడిబాట’ నిర్వహిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో గత రెండు రోజులుగా ఉపాధ్యాయులు తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులను కోరుతున్నారు. మీ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించి బడిని బ్రతికించడంతోపాటు పిల్లలకు మంచి భవిష్యత్తు అందించే విద్యా బోధన అందిస్తామని హామీ ఇస్తున్నారు. కొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు అంగీకరిస్తూ హామీ పత్రం ఇస్తున్నారు. దీంతో ఒక్కో పాఠశాలలో ఐదు నుండి పదిమంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు.