1 April, 2026 | 11:03 PM

కుతుబ్షాపురంలో ఘనంగా బడిబాట

01-04-2026 09:10 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కుతుబ్షాపురం గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆకుల కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందపాటి శ్రీనివాసరాజు, పంచాయతీ కార్యదర్శి నరసరాజు, లావణ్య, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.