అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు ప్రభుత్వం ఆమోదం పట్ల హర్షం
01-04-2026 09:15 PM
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సత్యనారాయణ
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించడం శుభసూచికమని న్యాయవాదులు కొనియాడారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి న్యాయవాదులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఏ ఎల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ విధంగా పరిష్కారం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఐ ఏ ఎల్ నాయకులు కుమార స్వామి, హరి చరణ్, శ్రీనివాస్, సతీష్, ప్రతాప్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.




