మే 29 నుంచి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు
హైదరాబాద్, ఏప్రిల్ 28: వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియ న్షిప్ పోటీలు మే 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ యూబీఎన్ బాబు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను అండర్ 11, 13,15,17,19 మెన్, ఉమెన్, మికస్డ్ డబుల్స్, మాస్టర్స్ విభాగాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పోటీలు కూకట్పల్లిలోని ఎస్ ఎల్ వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీలో జరగనున్నాయని తెలిపారు. వికారాబాద్ జిల్లాకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని, ఇతర జిల్లాలకు చెందిన క్రీడాకారులు అర్హు లు కారని స్పష్టం చేశారు. పోటీల్లో పాల్గొనదలచిన ఆసక్తి గల క్రీడాకారులు మే 20వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం సంఘం వ్బుసై ట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.






