పట్టుదలతో చదవండి
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
నవాబ్పేట,జూలై 14 : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అదనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులతో పాటు,ప్రస్తుతం జరుగుతున్న వివిధ మరమ్మతు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనుల్లో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, విద్యార్థినులకు ఇబ్బంది కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను,కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడీవో జయరాం నాయక్, ఎంపీఓ భద్రూ నాయక్, మండల విద్యాశాఖాధికారి నాగ్య నాయక్, గ్రామ సర్పంచ్ గీతారాణి, ఎస్‌ఓ మాధవి, ఏపీవో జ్యోతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






