16 August, 2026 | 10:16 PM

డిఫెన్స్ సిబ్బంది కోసం ప్రోషీల్డ్‌ ఆవిష్కరించిన బజాజ్ ఇన్సూరెన్స్

16-08-2026 08:32 PM

పుణే, 15 ఆగస్టు 2026: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్) ప్రోషీల్డ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. డిఫెన్స్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్యాకేజ్డ్ మోటార్ ఇన్సూరెన్స్ పరిష్కారంతో పాటు, నేటి డిజిటల్‌గా అనుసంధానమైన వాహనాలు (కనెక్టెడ్ వాహనాలు), అలాగే మారుతున్న మొబిలిటీ రిస్క్‌లకు అనుగుణంగా, మెరుగుపరచిన తదుపరి తరం మోటార్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌ 'విపే 2.0'ను కూడా సంస్థ ఆవిష్కరించింది.

దేశ సరిహద్దులు, భద్రతను కాపాడే మన రక్షణ సిబ్బంది తరచూ బదిలీలు, కార్యాచరణ బాధ్యతలు, కుటుంబాలకు సుదీర్ఘకాలం దూరంగా ఉండటం వంటి ప్రత్యేక పరిస్థితులతో కూడిన జీవనశైలిని గడుపుతుంటారు. వారి సేవలకు గౌరవంగా రూపొందించిన ప్రోషీల్డ్, సైనిక జీవనశైలిలో ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లకు అనుగుణంగా రూపొందించిన ఒక ప్రత్యేక బీమా పరిష్కారం. విధి నిర్వహణలో వారు ఎక్కడ ఉన్నా వారికి రక్షణ, సౌకర్యం, నమ్మకమైన ఆర్థిక భరోసాను అందించడమే ఈ ప్రోషీల్డ్ లక్ష్యం.

ప్రోషీల్డ్‌లోని ముఖ్యమైన ఫీచర్లు:వాహన తరలింపు రక్షణ ఫీచర్ ఒక పోస్టింగ్‌ నుంచి మరో పోస్టింగ్‌కు మారే సమయంలో, లైసెన్స్ పొందిన క్యారియర్‌ ద్వారా తరలించే వాహనాలకు పాలసీ రక్షణను అందిస్తుంది, అంతేకాకుండా క్యారియర్‌ ద్వారా వాహనం తరలించే సమయంలో బీమాదారుడి తప్పులేకుండా జరిగిన అర్హత కలిగిన ప్రమాదాల్లో నో క్లెయిమ్ బోనస్ రక్షణ కూడా కల్పిస్తుంది.ప్రయాణ అత్యవసర రక్షణ అనేది విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో వాహన ప్రమాదం కారణంగా విమానం మిస్ అయినప్పుడు, పాలసీ నిబంధనలకు లోబడి మిస్ అయిన విమానం టికెట్ ఖర్చులు, హోటల్ వసతి కోసం అయిన ఖర్చులను రీయింబర్స్‌మెంట్ రూపంలో అందిస్తుంది.

డాక్యుమెంట్ లాస్ ప్రొటెక్షన్ ఫీచర్ ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి, వారి జీవిత భాగస్వామికి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి ముఖ్యమైన వాహన డాక్యుమెంట్లు పోయిన సందర్భంలో వాటి స్థానంలో కొత్త వాటిని పొందేందుకు అయ్యే ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.ప్రత్యేక ప్రాధాన్యతా సహాయం  ఫీచర్ ద్వారా వ్యక్తిగత క్లెయిమ్‌లకు మద్దతు, అలాగే దేశవ్యాప్తంగా 7,300కు పైగా గ్యారేజీల నెట్‌వర్క్‌ సదుపాయం.అంతర్నిర్మిత ఆర్థిక రక్షణ ఫీచర్ ద్వారా జీరో డిప్రిసియేషన్‌తో అపరిమిత క్లెయిమ్‌ల సదుపాయం, డిడక్టిబుల్ మొత్తం మినహాయింపు కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌, టైర్ కవర్, రిమ్ కవర్, ఎలుకల వల్ల కలిగే నష్టానికి కవరేజ్, టోయింగ్ కవర్, భౌగోళిక పరిధి పొడిగింపు, ర్యాలీ కవర్ మరియు యాక్సెసరీస్ కవర్ వంటివి లభిస్తాయి.