బ్యాంక్ ఆఫ్ బరోడా ఓవర్సీస్ బాండ్ల జారీకి స్పందన
15-08-2026 01:13 AM
700 మిలియన్ యూఎస్ డాలర్లను సమీకరించిన బ్యాంక్
ముంబై, ఆగస్టు 14: బ్యాంక్ ఆఫ్ బరోడా అంతర్జాతీయ మార్కెట్ నుంచి నిధుల సేకరణకు రెండు భాగాల డాలర్ బాండ్ల ద్వారా 700 మిలియన్ యూఎన్ డాలర్లను విజయవంతంగా సేకరించిం ది. గిఫ్ట్ సిటీలోని బ్యాంక్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ బ్యాంకింగ్ యూనిట్ ద్వా రా చేపట్టిన ఈ బాండ్ల జారీకి పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీని ఆ ర్డర్ బుక్ గరిష్టంగా 2.67 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తుది ఇష్యూ పరిమాణం కంటే దాదాపు 3.8 రెట్లు ఎక్కువ డిమాండ్‌ను సూచిస్తుంది.






