13-11-2025 12:23:07 AM
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
వనపర్తి మండలం, నవంబర్ 12 : కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మితిపోరుతున్నాయని పోలీస్ అధికారులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ బి.ఆర్.ఎస్ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం.హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తెల్లరాలపల్లి తాండలో బాబు నాయక్ కుటుంబంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ బుధవారం జిల్లా ఎస్.పి ని కలిసి పానగల్ ఎస్. ఐపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కేంద్రం లోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బాబు నాయక్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంది అని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశములో మాజీ ఎం.పి.పి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎస్.టి.సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మండల అధ్యక్షులు వీర సాగర్, కో కన్వీనర్ తిలక్, సుధాకర్ యాదవ్, రాజేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.