#NBK111 షూటింగ్లో బాలకృష్ణకు గాయం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్ట్ వద్ద తన రాబోయే చిత్రం 'NBK111' కోసం ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా నందమూరి బాలకృష్ణ మోకాలికి గాయమైంది. చిత్రీకరణ సమయంలో ఈ ఘటన జరగడంతో షూటింగ్‌ను నిలిపివేశారు. అనంతరం బాలకృష్ణను కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రం 'వీర సింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ కలయికలో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.
షూటింగ్ లో బాలయ్యకు జరిగిన ప్రమాదంపై నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. బాలకృష్ణకు ప్రమాదంపై జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు. మీరు మళ్లీ సింహంలా గర్జించాలని ఎదురుచూస్తున్నాని ఎన్టీఆర్ తెలిపారు. బాబాయ్ త్వరగా కోలుకోవాలని నందమూరి కళ్యాణ్ రామ్ పోస్టు చేశారు. షూటింగ్ లో బాలయ్యకు జరిగిన ప్రమాదంపై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించారు. యాక్షన్ స్వీక్వెన్స్ లో బాలకృష్ణకు మజిల్ టియర్ అయ్యిందని తెలిపారు. బాలయ్యకు మైనర్ సర్జరీ చేయాల్సిఉందని పేర్కొన్నారు. సినిమాపై ఆయన క్రమశిక్షణ, కష్టపడేతత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గోపీచంద్ మలినేని ప్రకటించారు. బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు గోపీచంద్ తెలిపారు. కాకినాడలో #NBK111 సినిమా షూటింగ్‍లో గాయపడిన నందమూరి బాలకృష్ణని మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించారు. బాలా మావయ్య త్వరగా కోలుకుని, యధావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.






