calender_icon.png 18 February, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్క సుమన్ అరెస్టు

18-02-2026 05:51:20 PM

హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ను పోలీసులు అరెస్టు చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ ఎక్స్ ఆఫిషియో ఓటు చేసేందుకు క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు వారి కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేశారు. అంతేకాకుండా బాల్క సుమన్ పోలీస్ సెక్యూరిటీ కోన్ విసిరేశారు.

ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. క్యాతనపల్లిలో జరిగిన దాడిలో బాల్క సుమన్ తన అనుచరులను రెచ్చగొటి దాడి చేయించడంలో కీలక పాత్ర పోషించారని బెల్లంపల్లి ఏసీపీ, సీఐ ఆయనను ఆరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన గొడవలో భాగంగా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మేల్యే ఇంటికి వెళ్లిన పోలీసులు నిబంధనల ప్రకారంగా అదుపులోకి తీసుకున్నారు.

బాల్కసుమన్ అరెస్టు సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు భారీగా గుమికూడి ఇంటి గేటు మూసి పోలీసులను ఇంట్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి హంగమా సృష్టించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసు నిబంధనల ప్రకారం బాల్క సుమన్ అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న రామకృష్ణాపూర్ పోలీసు స్టేషన్ లో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. ఆయన పోలీసులపై దౌర్జన్యం చేశారని, పోలీసుల విధులను అడ్డుకున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.