17 April, 2026 | 3:26 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బాల్క సుమన్‌కు బెయిల్

03-03-2026 12:23 AM

షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన మంచిర్యాల కోర్టు

ఆదిలాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తి సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.25 వేల విలువ గల ఎగ్జిక్యూటివ్ బాండ్ సమర్పించడంతో పాటు, ఒక్కొక్కరికి ఇద్దరు షూరిటీలు సమర్పించాలని స్పష్టం చేశారు.

అంతేకాకుండా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏ1, ఏ2, ఏ4, ఏ8 లు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి షరతు విధించారు. ఈ నిబంధనలు మూడు నెలల ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

సుమన్ బెయిల్ రద్దు చేయండి

ఇదిలా ఉండగా చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్‌పై నమోదైన ఉన్న కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది.