25 June, 2026 | 3:27 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

యువ వికాసంతో యువత జీవితాల్లో వెలుగులు

29-05-2025 03:20 AM

- జూన్ 2న మంజూరు పత్రాలు

- డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

- అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్  

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): రాజీవ్‌యువ వికాసం పథకాన్ని పక్కాగా అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువతీ యువకుల జీవితాల్లో వెలుగులు నింపుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నుంచి బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి అన్నిజిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. యువతలో ఉన్న శక్తి సామర్థ్యాలపై అపార విశ్వాసంతో రాష్ట్రప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. పథకం ద్వారా రాష్ట్ర జీడీపీ కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.

పదేళ పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్.. కార్పొరేషన్లకు మొక్కుబడిగా నిధులు కేటాయించేదని, కానీ.. కాంగ్రె స్ ప్రభుత్వం అలా కాదని, సర్కార్ మనసుపెట్టి  రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. పథకం అమలుకు సర్కార్ రూ.8 వేల వేల కోట్లు కేటాయిస్తున్నామని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందన్నారు.

పథకం ద్వారా రాష్ట్రంలో మానవ వనరుల వృద్ధి, వినియోగం జరుగుతుందని, తద్వారా రాష్ట్రంలో వ్యాపా ర కార్యకలాపాలు విస్తృతమవుతాయని ఆకాంక్షించారు. పథకం అమలును పర్యవేక్షిం చేందుకు గాను ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రా లు అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

కాన్ఫరెన్స్‌లో సీఎస్ రామకృష్ణారావు, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, బీసీ సంక్షేమశాఖ కమిషన ర్ శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ పాల్గొన్నారు.