calender_icon.png 20 January, 2026 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటయోధుల త్యాగ ఫలితంతోనే స్వేచ్ఛ

17-09-2024 02:19:41 PM

శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ 

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎందరో పోరాటయోధుల త్యాగ ఫలితంతోనే నేడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయిందన్నారు. అద్భుత ఘట్టాలు జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని తెలిపారు.

చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరుపేరునా స్మరించుకోవాల్సిన కర్తవ్యం మన అందరిపై ఉందని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విట్టల్ ,కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఎస్పీ డి వి శ్రీనివాస్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డి.ఎస్.పి కరుణాకర్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.