20 March, 2026 | 6:11 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం

20-03-2026 04:21 PM

భిక్కనూర్, మార్చి 20(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్, బ్యూటీ అండ్ వెల్నెస్ ల్యాబ్‌లను మండల విద్యాధికారి రాజగంగారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్‌లను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పాఠ్యపుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా ప్రాయోగిక నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్, బ్యూటీ అండ్ వెల్నెస్ కోర్సులపై తరగతులతో పాటు ప్రాక్టికల్ శిక్షణ కూడా అందించనున్నట్లు చెప్పారు.

ఈ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించి, వారి ప్రతిభను వెలికితీయడానికి ఈ ల్యాబ్‌లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అలాగే ఈ ల్యాబ్‌ల ద్వారా ప్రాక్టికల్ జ్ఞానం పెంపొందించి, విద్యార్థులను స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాల వైపు దారితీసేలా మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భవాని, పీఆర్‌టీయూ సంఘ నాయకులు శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.