తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి
20-03-2026 04:22 PM
దోమకొండ , మార్చి 20,(విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం పురాతనమై శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం మంజూరుకు రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి భవనం మంజూరు చేయాలని శుక్రవారం ప్రభుత్వ సలహాదారు షబ్బిర్ అలీ ని కోరినట్లు దోమకొండ సర్పంచ్ తెలిపారు. స్పందించిన షబ్బీర్ అలీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి భవనం మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మధు, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.




