2 July, 2026 | 4:42 AM

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు

20-03-2026 04:28 PM

గ్రామ సమస్యల వివరణ

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కాంగ్రెస్ నాయకులుశుక్రవారం షబ్బీర్ అలీని కలిసారు.ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని గ్రామ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎదురవుతున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.